జగన్ పై దాడి ఘటన…ఆ డాక్టర్ పై తప్పుడు ప్రచారం చేశారా ?

jagan,ys jagan,ys jagan mohan reddy

ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై దాడి జరిగిన వెంటనే ఆయనకు ప్రధమ చికిత్స చేసిన డాక్టర్ స్వాతి మాట్లాడిన ఆడియో టేప్ సోషల్ మీడియా లో వైరల్ కావటం తో తనపై దుష్ప్రచారం చేశారని డాక్టర్ స్వాతి చెప్తున్నారు. ఒక డాక్టర్ గా తన పని తాను చేసినట్టు చెప్తున్న స్వాతి తాను తన ఫ్రెండ్ తో మాట్లాడిన ఆడియో రికార్డింగ్ కావాలనే ఎవరో సోషల్ మీడియాలో వైరల్ చేశారని తనకు ఈ ఘటనతో ఏ సంబంధం లేదని చెప్పారు.
విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఏపీ ప్రతిపక్షనేత జగన్ పై శ్రీనివాస్ అనే వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. అయితే తనపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం జరుగుతోందని జగన్‌కు విశాఖ ఎయిర్‌పోర్టులో ఫస్ట్‌ ఎయిడ్‌ నిర్వహించిన అపోలో మెడికల్‌ సెంటర్‌ డాక్టర్‌ కె.లలితాస్వాతి అన్నారు. ‘జగన్‌పై అటాక్‌ చేశారు.. వెంటనే రావాలని ఎవరో కొంతమంది తనవద్దకు రావడంతో స్టెతస్కోపు, బీపీ మెషీన్‌ తీసుకుని హుటాహుటిన అక్కడికి వెళ్లానని జగన్‌ ధరించిన తెల్ల చొక్కా రక్తంతో తడిసింది. దాంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యానని చెప్పారు. జగన్ గారే జాగ్రత్త తల్లీ..అంటూ తనచేత ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నారు అని డాక్టర్ స్వాతి చెప్పారు.
నేను ఫస్ట్‌ ఎయిడ్‌ మాత్రమే చేశా. ఎటువంటి ట్రీట్‌మెంట్‌ చేయలేదు. సుమారుగా 0.5 సెంటీమీటర్‌ మేర కత్తి దిగిందని రిపోర్టులో ఇచ్చా. గాయం లోతు అంతకన్నా ఎక్కువ ఉండవచ్చనే భావించా. రిపోర్టు కూడా పోలీసులు వచ్చి వెంటనే కావాలని ఒత్తిడి చేస్తే హడావుడిలో రాసిచ్చేశా. కానీ ఆ రిపోర్ట్‌ను పట్టుకుని కొందరు నాపై తప్పుడు ప్రచారానికి దిగారు’అని స్వాతి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, తాను ఫ్రెండ్‌తో ఫోన్‌లో మాట్లాడుకున్న విషయాలను కూడా రికార్డ్‌ చేసి సోషల్ మీడియాలోకి పంపించారని స్వాతి పేర్కొన్నారు. 0.5 సెం.మీ.పైన కత్తి గాయమైనప్పటికీ.. ఆ కత్తికి విష రసాయనాలు ఏమైనా ఉన్నాయేమోనని మరింత లోతుగా కట్ చేసి కుట్లు వేస్తారు. దాంతో అయనకు ఎక్కువ కుట్లు పడ్డాయని ఆమె అన్నారు. జగన్ కు అయిన గాయం గురించి కావాలనే అలా తనపై తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారని స్వాతి అంటున్నారు.

#Ysjagan #Jagan #JaganMohanReddy #TheAttackOnTheYsJaganWasTheWrongPromotionOnTheDoctor