శ్రీనివాసరావు విషయంలో అనేక అనుమానాలు

 

Srinivasa rao
Jagan attack

శ్రీనివాసరావు విషయంలో అనేక అనుమానాలు

విశాఖ విమానాశ్రయంలో విపక్ష నేత జగన్ లక్ష్యంగా జరిగిన దాడి కేసులో విచారణ ముమ్మరం చేసారు పోలీసులు. నిందితుడు శ్రీనివాసరావు నుంచి నిజాలు రాబట్టే పనిలో ఉన్న పోలీసులకు అతని ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు సవాల్ గా మారింది అనే చెప్పవచ్చు. మూడో రోజు అతడిని విమానాశ్రయ పోలీస్‌ స్టేషన్‌లో విచారిస్తున్న సందర్భంలో చేతులు, ఛాతిలో నొప్పి ఉన్నట్టు అతడు చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Image result for jagan attack srinivasa rao

తొలుత స్థానిక వైద్యుడు దేవుడుబాబుతో వైద్య పరీక్షలు చేయించారు. బీపీ, షుగర్‌ సాధారణ స్థితిలోనే ఉన్నాయని, చాతిలో నొప్పి, చేతులు తిమ్మిరిగా ఉన్న నేపథ్యంలో కేజీహెచ్‌లో నిపుణులతో వైద్యం చేయిస్తే మంచిదని చెప్పడంతో అతనిని అక్కడికి తరలించారు. ఈ సందర్భంగా అతను కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసాడు.

Image result for jagan attack srinivasa rao

తనకు వైద్య సహాయం వద్దని, తన అవయవాలు తీసుకుపోండంటూ శ్రీనివాసరావు కోరుతున్నాడని వైద్యులు దేవుడుబాబు తెలిపారు. దీనితో పోలీసులు ఆశ్చర్యపోయారు.