ఈసారి చింతమనేని కాదా..?

chintamaneni prabhakar,trendingandhra,latest tdp news,chandrababu naidu,andhrapradesh latest news,trendingandhra

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో అభ్యర్ధుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సర్వేలు చేయిస్తూ అభ్యర్ధులను ఎంపిక చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పటికే కొంత మంది అభ్యర్ధులను దాదాపుగా ఖరారు చేసిన ఆయన కీలక నియోజకవర్గాల విషయంలో కూడా ద్రుష్టిసారిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఒక కీలక సీటుకి లోకేష్ పేరుని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. దెందులూరు నియోజకవర్గానికి చెందిన చింతమనేనికి ఈసారి సీటు ఇవ్వకుండా ఆ సీటు కి లోకేష్ ని నిలబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారట. చింతమనేనికి ఎమ్మెల్సి ఇచ్చి మంత్రి పదవి ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంపై పార్టీలో చర్చలు కూడా జరుగుతున్నట్టు సమాచారం. ముందుగా చింతమనేనిని ఒప్పించే లోకేష్ కి కూడా చెప్పినట్టు తెలుస్తుంది. లోకేష్ కి ఇస్తే తానే గెలిపిస్తా అని కూడా ప్రభాకర్ చెప్పినట్టు సమాచారం.