ఈసారి జగన్ పులివెందుల పులి కాదు..?

jagan,ys jagan,ys jagan mohan reddy,jagan news,ap politics

వచ్చే ఎన్నికల్లో జగన్ నియోజకవర్గం మార్చుకునే అవకాశాలు ఉన్నాయి అనే వార్తల నేపధ్యంలో ఆయన రెండు నియోజకవర్గాల్లో పోటి చేస్తారు అనే ప్రచారం జరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అసలు ఆయన పులివెంధులను పూర్తిగా వదిలేసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ప్రస్తుతం తన మేనమామ ప్రాతినిధ్యం వహిస్తున్న కమలాపురం నుంచి పోటి చేసే ఆలోచనలో జగన్ ఉన్నారని తెలుస్తుంది. ఇక పులివెందులకు తన మామను మార్చాలని భావిస్తున్నారట. ఇందుకోసం రవీంద్ర నాథ్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించడం కూడా మొదలుపెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీకి మద్దతు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో పర్యటనలు చెయ్యాలని భావిస్తున్నారట. అటు జగన్ పోటి చేస్తారని నియోజకవర్గానికి చెందిన నేతలకు కూడా చెప్తున్నారట పార్టీ నాయకులు. మరి ఇది ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.