వీరరాఘవ పై టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు ….!

Tollywood celebrities Appreciations on Aravinda Sametha, trendingandhra

ఎన్టీఆర్ అరవింద సమేత’ చిత్రంపై ప్రశంసలు జల్లు కురుస్తోంది. అక్టోబర్ 11న విడుదలైన ఈ మూవీ రికార్డ్ కలెక్షన్ల‌తో నాన్ బాహుబలి రికార్డ్స్‌ను బ్రేక్ చేసి సన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఎన్టీఆర్ కెరియర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రంపై టాలీవుడ్ సెలబ్రిటీలు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

NTR, Aravinda Sametha,Trendingandhra

దర్శకధీరుడు రాజమౌళి, జై లవకుశ దర్శకుడు బాబీ, మెగా హీరో సాయి ధరమ్ తేజ్, నిఖిల్, నితిన్‌లతో పాటు టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు ఎన్టీఆర్ నటనకు ఫిదా అవుతూ ట్విట్టర్ ద్వారా చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా అక్కినేని హీరో అఖిల్.. ఎన్టీఆర్‌లో ఫైర్‌ని చూశా అంటూ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు.

Aravinda-Sametha,trendingandhra

‘తారక్ ఇంక్రెడిబుల్ యాక్టర్ అని అరవింద సమేత చిత్రంతో మరోసారి రుజువుచేశారు. ఎన్టీఆర్ మంచి ఫామ్‌లో ఉన్నారు. వీర రాఘవలో ఫైర్‌ని చూశా.. ప్రేక్షకుల హృదయానికి హద్దుకునే సినిమా తీసిన దర్శకుడు త్రివిక్రమ్‌కి, అద్భుతమైన సంగీతం అందించిన తమన్‌కి, ఈ సినిమాలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకుని గ్రేట్ ఎఫర్ట్ పెట్టిన హీరోయిన్ పూజా హెగ్డేకి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు నిఖిల్.