బండిమీద కేసులు కట్టలేక, పోలీసులకే బండిని గిఫ్ట్ గా ఇచ్చిన స్థానికుడు.

సాధారణంగా మనం బైక్ లేదా స్కూటర్ మీద వెళుతూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగిస్తే ఫైన్ పడుతుంది. ట్రాఫిక్ వారు మనకు ఫైన్ వేయగానే కంగారు పడిపోతాం. చలానాలు ఎక్కువైతే పోలీసులు కేసు నమోదు చేస్తారేమోనని భయపడతాం. కానీ హైదరాబాద్ లోని రాచనగరి ప్రాంతంలో విచిత్రమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది.

రాచనగరి ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కేేఏ 09హెచ్ డీ 4732 నంబర్ ఉన్న స్కూటర్ పోలీసులు గుర్తించారు. ఈ స్కూటర్ ఫై ఉన్న రికార్డులు పరిశీలించిన పోలీసులు విస్తుపోయారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 635 కేసులు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం జరిమానాలను లెక్కించి రూ.63,500 కట్టాల్సిందిగా బండి యజమానికి చలానా ఇచ్చారు.

అసలు కంటే కొసరే ఎక్కువయిందన్నట్లు స్కూటర్ ఖరీదు కంటే జరిమానా మొత్తం ఎక్కువ కావడంతో ఆ యజమాని తెలివిగా వ్యవహరించి, తాను ఈ స్కూటర్ అమ్మేసినా రూ.63,500 కట్టలేననీ, కాబట్టి ఈ బండిని మీరే ఉంచుకోండని పోలీసులకు ఇచ్చేసి ఎంచక్కా అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఆ సమాధానంతో పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది.