అక్కడ ఓడితే బిజెపికి చుక్కలే..

trending bjp political news,narendra modi,bharatiya janata party,latest political bharatiya janata party news,trendingandhra

రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో బిజెపికి అతిపెద్ద సవాల్ ఎదురైంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ఆ పార్టీకి కర్ణాటకలో శనివారం జరుగుతున్న ఉప ఎన్నికలు సవాల్ గా మారాయి. రాష్ట్రంలోని మూడు 3 లోక్‌సభ, 2 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతుంది. బళ్లారి, శివమొగ్గ, మండ్య లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా రామనగర, జమఖండి అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నేడు జరుగుతుంది. పోలింగ్‌ కోసం ఎన్నికల అధికారులు 6,450 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయిలో కూటమిలో కాంగ్రెస్ జెడిఎస్ పార్టీలు ఉండటం, హింది రాష్ట్రాల ఎన్నికల నేపధ్యంలో ఎలాగైనా గెలవాలి అనే పట్టుదలతో బిజెపి ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ బిజెపి ఓడిపోతే మాత్రం ఆ ప్రభావం వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికలపై స్పష్టంగా పడుతుంది.