కెసిఆర్ పై నమ్మకంపోయిందా..?

trending political telangana news,telugu news,kcr,latest political news,trendingandhra

ఫెడరల్ ఫ్రంట్ అంటూ అడుగులు వేసిన తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి తెరాస అధినేత కెసిఆర్ విషయంలో ఇప్పుడు ఆ రాష్ట్రంలోనే నమ్మకం పోయిందా..? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయ శక్తి కావాలి అని ప్రకటన చేసిన కెసిఆర్ కలకత్తా వెళ్లి ముఖ్యమంత్రి మమత బెనర్జిని కెసిఆర్ కలిసిన సంగతి అందరికి తెలిసిందే. ఆ తర్వాత ఆమె ఇప్పటి వరకు కెసిఆర్ తో మాట్లాడిన సందర్భాలు లేవు అనే చెప్పాలి. అలాగే డిఎంకె అధినేత స్టాలిన్ ని కరుణానిధి బ్రతికి ఉన్నప్పుడు కలిసినా ఇప్పటి వరకు ఆయన మళ్ళి కలిసి మాట్లాడిన సందర్భం ఒక్కటి కూడా లేదు. అదే విధంగా కర్ణాటక ఎన్నికలకు ముందు జెడిఎస్ ని కలసిన ఆయన ఆ తర్వాత ప్రమాణస్వీకారానికి కూడా వెళ్ళకుండా ఆగిపోయారు. ఇప్పుడు చంద్రబాబు వెళ్లి అందరిని కలుస్తున్నారు. దీనితో ఆయన కలిసిన పార్టీలు అన్ని ఇప్పుడు చంద్రబాబుకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీనితో కెసిఆర్ పై రాష్ట్రంలో నమ్మకం పోయింది అనే అభిప్రాయలు వినపడుతున్నాయి.