రోజా జీవితంలో అదే కీలక మలుపు …..రోజా జీవితం లో జరిగిన నగ్న సత్యాలు ఇవే…!

 roja, MLA Roja, Trendingandhra

ఒకప్పటి స్టార్ హీరోయిన్ , ప్రస్తుత నగరి నియాజకవర్గ శాసనసభ్యురాలు రోజా , పలు సూపర్ హిట్స్ చిత్రాలలో నటించింది . ఇటు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరుపొందింది. ప్రత్యర్థి ఫై మాట్లాడాలి అన్న , మాటలతో వారిని నిలువరించాలి అన్న రోజా పేరే గుర్తుకువచ్చేలా గుర్తింపు పొందింది రోజా . హీరోయిన్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న రోజా,శాసనసభ్యురాలు అయ్యాక కూడా ,నటన ఫై ఉన్న ఆసక్తి తో టీవీ చానల్స్‌లో వచ్చే గేమ్, కామెడీ షోలలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.

roja heroine,trendingandhra

రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి, మొదట్లో రోజా నాన్న నాగరాజా రెడ్డి హైదరాబాద్ లోని ప్రముఖ సారధి స్టూడియోస్ లో పనిచేసేవారు. కాలేజ్ గ్రూప్ ఫొటో చూసి రోజా మొదటి సినిమా డైరెక్టర్ రోజాని ఎంపిక చేసారు.ఆ సినిమానే ప్రేమ తపస్సు, డైరెక్టర్ రోజా ఫాదర్ అంతకుముందే ఫ్రెండ్ నాన్న కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రోజా సినిమా ఎంట్రీ చాలా ఈజీగానే జరిగింది.ఈ సినిమాలో పల్లెటూరి పేద పిల్లగా నటించిన రోజా. ఆ తర్వాత ఎన్నో గ్లామరస్ పాత్రలు పోషించింది.పెద్ద పెద్ద హీరోలతో పెద్ద పెద్ద భ్యానర్లలో నటించింది.మీనా,రమ్యక్రిష్ణ,నగ్మా లాంటి తోటి హీరోయిన్లతో కలిసి చాలా సినిమాల్లో నటించినప్పటికి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకుంది .

roja,trendingandhra

రోజా భర్త సెల్వమణి . చామంతి సినిమా అప్పుడు వారి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది.రోజా నటించిన చామంతి సినిమాకు దర్శకుడు సెల్వమణి. తర్వాత సెల్వమణి దర్శకత్వంలో రోజా నిర్మాతగా ఒక సినిమా తీయడం.అది అట్టర్ ప్లాప్ అయ్యి రోజా భారీ నష్టాల్లో కూరుకుపోవడం జరిగాయి. ఆ కష్టాలన్ని తీరడానికి ఏడేళ్ల సమయం పట్టింది. ఆ తర్వాతే రోజా సెల్వమణి పెళ్లిచేసుకున్నారు. మొదటినుండి సెల్వమణి రోజాకు తోడుగి నిలుస్తూ వచ్చారు. ఆఖరుకి ఇప్పుడు రాజకీయాల్లో కూడా భర్త ప్రోత్సాహమే కారణమని ఒక సంధర్బంలో రోజా చెప్పుకువచ్చారు

#TurningPointinRojaLife #Roja #MLARoja