నేటి నుంచి రెండు రోజుల పాటు జేఎఫ్సీ సమావేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ లో అన్యాయం జరిగిందని, అసలు రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇంతవరకూ ఏ మేరకు నిధులు వచ్చాయో లెక్కలు తీయాలని డిమాండ్ చేస్తూ, ఓ ప్రత్యేక జేఎఫ్సీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.నేడు పలువురు రాజకీయ పెద్దలతో సమావేశం కానున్నారు. హైదరాబాద్ లోని దస్ పల్లా హోటల్ ఇందుకు వేదిక కానుండగా, నేడు, రేపు పలువురితో పవన్ సమావేశం కానున్నారు.

పవన్ చొరవతో ఏర్పాటు అవుతున్న ఈ సమావేశంలో లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్, వామపక్ష నేతలు మధు, నారాయణ, కాంగ్రెస్ ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జంగా గౌతమ్ తదితరులు పాల్గొంటారు.

ఇక కొంతమంది ఆర్థిక, విద్య, న్యాయ నిపుణులను సైతం పవన్ ఆహ్వానించారని, వారు కూడా సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను వెల్లడిస్తారని జనసేన వర్గాలు వెల్లడించాయి