ఆ సినిమా ఆగిపోయిందా..?

గురు సినిమా తర్వాత వెంకటేష్ ఇప్పటి వరకు మరో సినిమాకు సైన్ చేసింది లేదు. ఆ సినిమా విడుదలై దాదాపు ఏడాది దాటిపోయినా ఇప్పటి వరకు కూడా ఇంకో సినిమా చెయ్యలేదు. ఇటీవల తేజతో ఒక సినిమా ప్రారంభించినా ఆ సినిమా షూటింగ్ కూడా మొదలై ఆగిపోయినట్టు తెలుస్తుంది. దీనికి కారణం ఏంటి అనేది తెలియకపోయినా నిజమే అంటున్నాయి టాలివుడ్ వర్గాలు.
మొదలైన సినిమా ఎందుకు ఆపేశారు అంటూ చెవులు కొరుక్కుంటున్నారట టాలివుడ్ జనాలు.
ఇప్పుడు తేజా బాలకృష్ణ తో ఎన్టీఆర్ బయోపిక్ తో బిజీగా ఉన్నారు. దీనికంటే ముందే వెంకేష్ తో సినిమా మొదలు కూడా పెట్టడం జరిగింది. అనూహ్యంగా ఎన్టీఆర్ బయోపిక్ ప్రాజెక్ట్ ని ఓకే చేసారు. అయితే బాలకృష్ణ కోసం ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారా..? అసలు వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుందా రాదా…? అనే సందేహం అందరిలోనూ నెలకొంది.
అయితే ఎన్టీఆర్ బయోపిక్ వరకు ఈ సినిమాను ఆపేశారు అనే ప్రచారం జరుగుతుంటే కాదు కాదు అసలు సినిమానే ఆపేశారు అని మరికొందరు అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ టాలివుడ్ లో హాట్ టాపిక్.