జాహ్నవి తో సినిమా నిజమే …. అంటున్న విజయ్ దేవరకొండ

Vijay devarakonda Movie With Jhanvi Kapoor, Trending Andhra

ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ ప్రస్తుతం బాలీవుడ్ లో కాఫి విత్ కరణ్ అనే షో ని నిర్వహిస్తున్నాడు. ఆ షో కి ఈ మధ్య శ్రీ దేవి కూతురు జాహ్నవి వచ్చింది. ఆమె తన మొదటి సినిమా దఢక్ తో బాగా పాప్యులర్ అయ్యింది. సినిమాలో ఆమె అందానికి , అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ఆ షో లో భాగంగా కరణ్ నీకు హీరోస్ లో ఎవరంటే ఇష్టం అని అడిగిన ప్రశ్నకు జాహ్నవి బాలీవుడ్ యంగ్ స్టార్స్ అందరిని వదిలేసి మన టాలీవుడ్ రౌడీ విజయ్ దేవకొండ పేరు చెప్పడంతో బాలీవుడ్ యువ హీరోలు షాక్ కి గురయ్యారు.

Image result for vijay devarakonda hd images

నాకు విజయ్ స్టైల్ , ఆటిట్యూడ్ అంటే చాలా ఇష్టం అని జాహ్నవి పేర్కొంది.ఆయన తో ఒక మూవీ కూడా చేస్తానని చెప్పింది. అప్పటి నుంచి విజయ్ దేవరకొండ బాలీవుడ్ కి వెళ్లనున్నాడనీ, ఆయన హీరోగా .. జాన్వీ హీరోయిన్ గా కరణ్ జోహర్ ఒక సినిమా చేయనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయాన్ని గురించి విజయ్ దేవరకొండ దగ్గర ప్రస్తావించగా, ‘ఆ కాంబినేషన్లో ఒక సినిమా చేస్తా’అని ఆయన చెప్పాడు. ‘టాక్సీవాలా’ ప్రమోషన్స్ సమయంలో తాను కరణ్ జోహర్ ఆఫీసుకి వెళ్లినట్టుగా కూడా ఆయన చెప్పాడు. దాంతో ఇప్పుడు ఈ వార్త మరింత బలాన్ని పుంజుకుంది. విజయ్ స్వయంగా సినిమా ఉంటుంది అని చెప్పడంతో త్వరలో విజయ్ – జాహ్నవి కాంబినేషన్ లో మూవీ చేయడం కన్ఫర్మ్. మరి అది కరణ్ తో ఉంటుందో లేదో చూడాలి.