ఆమ్మో విజయ్ రెమ్యూనరేషన్ అంత ???

ఆమ్మో విజయ్ రెమ్యూనరేషన్ అంత ???

టాలీవుడ్ యంగ్ సేన్సేన్షనల్ హీరో విజయ్ దేవరకొండ “అర్జున్ రెడ్డి” “గీత గోవిందం” వంటి బ్లాక్ బస్టర్ తో మంచి ఊపు మీద ఉన్నాడు. యంగ్ హీరోలు అయిన నాని,నితిన్,శర్వానంద్ కు అందని రేంజ్ విజయ్ సొంతం చేసుకున్నాడు.”గీత గోవిందం” సినిమా తో 75 కోట్లా మార్క్ ని టచ్ చేసిన ఈ సినిమా 100 కోట్లా వైపు పరుగులు తీస్తుంది.ఈ సినిమా విజయం తో విజయ్ తన రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసాడు అని టాలీవుడ్ ఇన్సైడ్ టాక్.

Geetha Govindam

“గీత గోవిందం” సినిమా కి 3 కోట్లా రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.తన తర్వాత సినిమాలకు ఏకంగా 10  కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడని టాక్. ఎన్నో ఏళ్లనుంచీ ఎంతో కష్టపడితే – ఇప్పటికి  రవితేజ ‘రాజా ది గ్రేట్’ సినిమాతో 10 కోట్లు పారితోషికం అందుకోగలిగాడు. అలాంటిది విజయ్  మూడే మూడు సినిమాలతోనే ఆ ఫీట్ ను సాధించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది..ఈ రేంజ్ రెమ్యూనరేషన్ కేవలం 4 వ సినిమా కి అంటే విజయ్ రేంజ్ ఏంటో అర్ధం అవుతుంది