బాబుకు భారీ షాక్‌ ఇవ్వబోతున్న విజయనగరం కీలక నేతలు ….!

tdp , chandrababu ,trendingandhra

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బాబుగారికి మైండ్‌బ్లోయింగ్ షాక్‌, ఇప్పటికే గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న బాబుకు.. సొంత పార్టీ నేతలు కూడా దిమ్మదిరిగే షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదని పలువురు నాయకులు గుర్రుగా ఉన్నారు. తాజాగా.. విజయనగరంలో జిల్లాలో టీడీపీ పరిస్థితి గందరగోళంగా తయారైంది. నేతల మధ్య సమన్వయం, ఐక్యత కొరవడి క్యాడర్ తీవ్ర నిరూత్సాహానికి గురవుతోంది. ఈ జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతల్లో ఒకరు పార్టీ మారుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

chandrababu,trendingandhra

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సందర్భంలో టీడీపీ విజయనగరం జిల్లాలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. సాలూరు నియోజక వర్గంలో ఆ పార్టీ నుంచి ఇద్దరు కీలక నేతలు ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, మరొకరు ఆర్‌పి భాంజ్‌దేవ్‌. అయితే ఈ ఇద్దరు నేతలు కూడా వచ్చే ఎన్నికల్లో సాలూరు ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్నారు. కొద్దిరోజులుగా చంద్రబాబు పలువురికి బహిరంగంగా మరికొందరికి అంతర్గతంగా టికెట్లు ఖరారు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సాలూరు ఎమ్మెల్య టిక్కెట్ ఆర్‌పి భాంజ్‌దేవ్‌కి ఇచ్చేందుకు చంద్రబాబు హామీ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్సీ సంధ్యారాణి తన అనుచరులతో సమావేశమయ్యారు. ఇందులో ఆమె కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

ఈ సమావేశంలో సంధ్యారాణి వర్గీయులు పార్టీ అధిష్ఠానం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆ సమావేశంలో పార్టీ మారి, తగిన బుద్ధి చెప్పాలని అనుచరులు గట్టిగా వాదించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని, ఈ మేరకు పార్టీ పెద్దలతో కూడా చర్చించారనే టాక్ వినిపిస్తోంది. అయితే.. తన రాజకీయ భవిష్యత్‌కు హామీ ఇస్తే పార్టీలో చేరుతానని సంధ్యారాణి చెప్పగా.. ఈ మేరకు జగన్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జగన్ సమక్షంలో సంధ్యారాణి వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఏదేమైనా.. ఎన్నికల ముందు బాబు బెంబేలెత్తిపోయే షాక్ మరెన్ని ఉన్నాయో మరి.

#VijayanagaramLeadersGoingtogivebigshocktoChandrababu #Chanrababu #TDP