విజయవాడ దుర్గమ్మ ఆలయంలో చీరయాయం

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన దేవాలయాల్లో చీరల మాయం ఇప్పుడు కలకలం రేపుతోంది. తెలంగాణలోని వరంగల్ భద్రకాళీ దేవాలయం , కాళేశ్వరం దేవాలయాల్లో చీరల మాయం అయినా మనకు తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఎలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ఆంధ్రాలోని విజయవాడ దుర్గమ్మ ఆలయంలో చీరయాయం బయటపడింది. దీంతో భక్తులు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. .

ఇక విషయానికొస్తే ఉండవల్లికి చెందిన లలితామండలి సభ్యులు బెజవాడ దుర్గమ్మకు చీరను సమర్పించారు. తరువాత దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు తాము సమర్పించిన చీర గురించి ఆరా తీయగా ఆలయాధికారులు నిమ్మకుండిపోయారు. చీర తెచ్చినట్టు రికార్డుల్లో రాయలేదని అందుకే తాము చీర మాయంపై పోలీసులకు ఫిర్యాదు చేయలేమని అధికారులు తెలిపారట. ఆలయాధికారులు ఆలయ పూజారే ట్రస్టు సభ్యుడు ఒకరికి ఇచ్చినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తోన్నారు. దీనిపై సీసీ టీవీ ఫుటేజితో పాటు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వారి నుంచి పోలీసులు సాక్ష్యాలు సేకరించారు. అయితే ఇప్పటి వరకు ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు. ఫిర్యాదు చేస్తే ట్రస్టు బోర్డు వారితో ఇబ్బందులు వస్తాయని ఆలయాధికారులు వెనుకడుగు వేస్తున్నారు. దీనిపై ఉండవల్లికి చెందిన సూర్యనారాయణ, వసుంధర దంపతులు పోలీసులకు పిర్యాదు చేయనున్నట్టు సమాచారం.