విరాటపర్వం 1992 ….హీరోగా రానా ..!

Virataparvam 1992 .... Hero Rana ..!,RanaDaggubati ,tollywood,telugu movies,trendingandhra

నీది నాది ఒకే కథ’ సినిమాతో దర్శకుడిగా వేణు ఉడుగుల మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తరువాత నుంచి ఆయన ఒక కథపై కసరత్తు చేస్తూ పూర్తి రూపాన్ని తీసుకొచ్చాడు. ఈ కథకి ఆయన ‘విరాటపర్వం 1992’ అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నాడు.

ఈ సినిమాను నానితో గానీ .. నితిన్ తో గాని .. శర్వానంద్ తో గాని రూపొందించాలని ఆయన ప్రయత్నించాడు. అయితే ఈ ముగ్గురూ కూడా ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీగా ఉండటంతో, వేణు ఈ కథను రానాకి వినిపించాడు. కథాకథనాల్లోని కొత్తదనం కారణంగా వెంటనే రానా ఈ ప్రాజెక్టు చేయడానికి అంగీకరించాడు.

ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవిని ఎంపిక చేసుకున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. రానా – సాయిపల్లవి కాంబినేషన్లో రూపొందనున్న ఈ సినిమాపై అంచనాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

#VirataParvam 1992 …. HeroRanaDaggubati ..! #RanaDaggubati #TollyWood #VirataParvam1992