ఢిల్లీ ఆస్పత్రిలో చేరిన విశాల్..ఎందుకో తెలుసా..?

హీరో,నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి, తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ ఢిల్లీ ఆస్పత్రిలో చేరారు.

తీవ్రమైన తలనొప్పి కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం.నిజానికి విశాల్‌ ఇరుంబుతిరై అనే చిత్రంలో నటించే సమయంలో విశాల్‌ గాయపడ్డాడు.అపుడు ఆయనకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఫిజియోథెరపీ చేయించుకోవాల్సిందిగా సలహా ఇచ్చారు.

కానీ,ఆయన తాత్కాలికంగా వైద్యం చేయించుకొని సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ వచ్చారు.ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న సండైకోళి 2 చిత్రం షూటింగ్‌ను ఇటీవలే పూర్తి చేశారు.దీంతో ఆయన ఇటీవల ఢిల్లీకి వెళ్ళి ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.

దీనిపై విశాల్‌ అనుచరులు స్పందిస్తూ,తాజాగా నటిస్తున్న సండైకోళి 2 చిత్రం షూటింగ్‌ పూర్తి కావడంతో ఫిజియో థెరఫీ కోసం విశాల్‌ ఆస్పత్రిలో చేరినట్టు వెల్లడించారు.