ఎన్టీఆర్ బయోపిక్ లో వి వి వినాయక్ ….ఆ పాత్ర కోసమేనా ..!

VvVinayakInNTRBiopic .... ForThatRole ..!,NtrBioPic ,VVVinayak,Chandrababu,RanaDaggubati,RakulPreet,trendingandhra

నటరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’. తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత కథను రెండు పార్ట్‌లుగా బాలయ్య తెరకెక్కిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం ప్రముఖ నటులనే ఎంపిక చేసుకున్నారు.

ఇప్పటికే చంద్రబాబు పాత్రలో రానా, ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్, ఏఎన్నార్‌గా సుమంత్, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ తదితరులు నటిస్తున్నారు. అయితే తాజాగా మరో కీలక పాత్ర కోసం వి.వి.వినాయక్‌ను తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ చిత్రంలో దాసరి నారాయణరావు పాత్ర కోసం వినాయక్‌ను తీసుకున్నట్టుగా వార్తలు వినవస్తున్నాయి. దాసరి, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ మంచి సక్సెస్‌ను సాధించడంతో ఈ చిత్రంలో ఆయన పాత్ర కూడా కీలకమైంది.

#VvVinayakInNTRBiopic …. ForThatRole ..! #NtrBioPic #VVVinayak #Chandrababu #ChandraBabuNaidu #NChandraBabuNaidu #BalaKrishna #RakulPreet #RanaDaggubati #VidyaBalan