బాలయ్య బాబు తో త్వరలో సినిమా ప్రారంభం

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: సినీ నటుడు నట సింహం నందమూరి బాలకృష్ణ నటించే ఓ సినిమాను త్వరలోనే సెట్స్‌ మీదకు తీసుకురానున్నట్లు ప్రముఖ స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్‌ తెలిపారు.తన కెరీర్‌కు కొంత గ్యాప్‌ ఇచ్చానని, నేటి సమాజానికి తగ్గట్టుగా కొత్త తరహా కథను బాలయ్య బాబు కోసం సిద్ధం చేసి తీసుకొస్తున్నట్లు తెలిపారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 36లో ఎన్‌అండ్‌జీ అసోసియేట్స్‌ ఇంటీరియర్‌ పేరుతో ఏర్పాటు చేసిన సంస్థను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటీరియర్‌ రంగంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటిని కొత్తదనంగా తీర్చిదిద్దుకోవాలని భావిస్తారన్నారు. నిర్వాహకులు నిషాంత్‌చౌదరి, వినీత చౌదరి మాట్లాడుతూ ఇంటీరియర్‌ రంగంలో ఇప్పటికే 30 లక్షల చదరపు అడుగుల పనులు తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలిపారు.