ఐటీ  దాడుల్ని స్వాగతిస్తున్నాం : బుద్దా  వెంకన్న

 
Budda venkanna , TrendingAndhra
మొన్నటి వరకూతెలంగాణ  రాష్ట్రం లో ఐటీ దాడులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పడు ఆంధ్ర ప్రదేశ్ వంతు వచ్చినట్లు తెలుస్తోంది. మరియు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు పై తెలంగాణ  రాష్ట్రముఖ్యమంత్రి  తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే … ఐతే ఈ విషయం పై తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు. మొన్నటి వరకూ చంద్రబాబు గారికి  సపోర్టు చేసిన కెసిఆర్ గారు ఇప్పుడెందుకు అలా  మాట్లాడుతున్నారని ప్రశ్నించారు… అంతేగాక కెసిఆర్ ఒక మురికి కాల్వ అని అతని మాటలెవరూ  నమ్మరని ,కేంద్రం  లో ఉన్న మోడీ ఎలా చెబితే అలా తలాడిస్తుంటారని తీవ్ర విమర్శలు చేసారు. ఇంకోసారి ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడి తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రస్తుతం ఏపీ లోని పరిస్థుతుల దృష్ట్యా ప్రజలందరూ ఏకమై వచ్చే ఎన్నికల్లో బీజేపీ కి బుద్ది  చెప్పాలని సూచించారు.
 
budda venkanna , Trendingandhra
 
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ముఖ్యమంత్రి గారిపై వైసీపీ అధినేత జగన్,  మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లు కలిసి కుట్రపన్నుతున్నారని మరియు తమ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని  విమర్శించారు. నరేంద్ర మోడీ తో కలిసి రాష్ట్రం లో టీడీపీ నాయకుల పై ఐటీ దాడులకు పాల్పడుతున్నారనీ, ఇదంతా కేవలం  ఎన్నికల ముందు కక్ష్య సాధింపు తప్ప ఎటువంటి నిజం లేదని అన్నారు . అంతే గాక అధికారాన్ని అడ్డు పెట్టుకొని వేలకు వేల  కోట్లను దోచుకున్నవారిని వదిలిపెట్టి , పథకం ప్రకారం తెలుదేశం నాయకులంను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని మోడీ గారిని నిలదీశారు. అయితే ఇలాంటి వాటికి ఏం  భయపడమని ,రాష్ట్రం  లో జరిగే  ఐటీ  దాడుల్ని స్వాగతిస్తున్నమని చెప్పుకొచ్చారు.