ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

పవన్‌ చొరవతో జేఎఫ్‌సీ హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్‌లో ఈ రోజు ఏర్పాటు అయ్యింది.వివిధ రాజకీయ పార్టీల నేతలు,మాజీ అధికారులతో పవన్‌ సమావేశమయ్యారు.కొన్ని రోజుల తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.విభజన చట్టం హామీలపై ఎవరి దారిలో వారు పోరాటం చేస్తారని అన్నారు.అందరి ప్రయత్నం రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని వివిధ పార్టీల నేతలు స్పష్టం చేశారు.పవన్ స్పందిన తీరు పై ఇప్పుడు రాజకీయ అస్త్రాన్ని పాటిస్తున్నారని కొంతమంది నేతల అభిప్రాయం వెల్లడవుతోంది.

ఈ (జేఎఫ్‌సీ) సమావేశంపై,ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై నిజానిజాలు తేల్చేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ (జేఎఫ్ సీ)పై తమకు నమ్మకం లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు పేర్కొన్నారు.

(బీజేపీ టీడీపీ)రెండు పార్టీలు సమన్వయంగా ఉండాలని,కలసికట్టుగా ముందుకెళ్లాలి తప్ప,బురదజల్లుకోవడం సబబు కాదని,కేంద్రంలో అధికారంలో ఉన్న తాము హుందాగా వ్యవహరిస్తున్నామని అన్నారు.ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ,ఏపీలోని రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదాను రాజకీయ అస్త్రంగా వాడుకునేందుకు చూస్తున్నారని,హోదాకు సమానంగా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నామని అన్నారు.

కాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు ఏపీ గొంతు కోసిందని విమర్శించిన ఆయన,గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ,కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఏపీ,తెలంగాణలకు సమానంగా పెట్టుబడులు ఎందుకు చేయలేదన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును కేవలం హైదరాబాద్ లోనే కాకుండా,అన్ని ప్రాంతాలకు విస్తరించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.ఏపీ ప్రజలకు రెండు పార్టీలు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా ముందుకెళ్లాలి అని అయన ఉద్దేశం తెలిపారు.