కోహ్లీ కావాలి …. ప్లీజ్

కోహ్లీ కావాలి .... ప్లీజ్

బారత్ లో క్రికెట్ కి అభిమానులు ఎక్కువే తమ అభిమాన క్రికెటర్ ని ఎమ్మన అంటే చాలు ఫ్యాన్స్‌ అందుకు తగ్గట్లుగానే రియాక్ట్‌ అవుతుంటారు.అందుకు సోషల్ మీడియాని వాడుకుంటారు .. నెగటివ్‌ అయితే తిడుతూ.. పాజిటివ్‌ అయితే సంబరపడుతూ బదుళ్లు ఇస్తుంటారు. అయితే మరి కోహ్లిని ఉద్దేశించి ట్వీట్లు చేస్తే ఊరుకుంటారా? వెంటనే ట్రోల్‌ చేసేస్తున్నారు. ఈపుడు ఈలాంటి సంగటనే ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది
పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో టీమిండియా కెప్టెన్‌ కోహ్లి ఆడితే చూడాలనుకుంటున్నాం అంటూ ఓ పాక్‌ అభిమాని ఫ్లకార్డు ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఇస్లామాబాద్‌ యునైటెడ్‌-క్వెట్టా గ్లాడియేటర్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటు చేసుకుంది. దీనిని పట్టుకుని సోషల్‌ మీడియాలో కూడా కొందరు కోహ్లికి రిక్వెస్ట్‌లు పెడుతున్నారు.

మరి అది చూసి టీమిండియా ఫ్యాన్స్‌ ఊరుకుంటారా? పీఎస్‌ఎల్‌కు కోహ్లిని కొనేంత సీన్‌ లేదు, కోహ్లి ధర వెలకట్టలేనిది, కోహ్లిని కోనడం కలలో కూడా మీకు జరగని పని, పాక్‌కు కశ్మీర్‌ ఎలాగో కోహ్లి కూడా అంతే.. రెండూ దక్కవు. మొత్తం ఇలాంటి సందేశాలే కనిపిస్తున్నాయి.
ఏది ఏమైనా కోహ్లి ని psl లో ఆడాలని పాకిస్తాన్ అబిమానులు కోరుకోవడం ఆనందించాల్సిన విషయమే అంటూ కోహ్లి అబిమానులు సంతోశిస్తునారు