త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి హీరోలు ఎందుకు ఎదురుచూస్తుంటారో తెలుసా …

Tollywood Heros , Trivikram , TrendingAndhra

టాలీవుడ్ మాటల మాంత్రికుడు , తెలుగు సినీ మాటల రచయిత మరియు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ . ఈయన ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి న్యూక్లియర్ ఫిజిక్స్ లో బంగారు పతకం సాధించాడు. తెలుగు సినిమా నటులలో ఆయనకు పవన్ కళ్యాణ్, సునీల్ ఇద్దరు ప్రాణ మిత్రులు . ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో జన్మించిన త్రివిక్రమ్ నటన పై మక్కువ తో చదువు అయిపోగానే హైదరాబాద్ కి వచ్చాడు . వచ్చిన మొదట్లో సునీల్ రోమ్ లో ఉంటూ కాలం గడిపేవాడు . ఆలా ఉన్న తరుణం లో గౌతంరాజు పిల్లలకు ఫిజిక్స్ ట్యూషన్ చెప్పడానికి సునీల్ త్రివిక్రమ్ ను కుదిర్చాడు. అతని టాలెంట్ చూసిన గౌతమ్ రాజు నిర్మాత టి. డి. వి. ప్రసాద్ కు పరిచయం చేసాడు.

తరువాత దర్శకుడు విజయభాస్కర్ దగ్గర స్వయంవరం, నువ్వేకావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ వంటి చిత్రాలకు మాటల రచయితగా పనిచేసాడు. వాటితో పాటుగా మరికొన్ని సినిమాలకు మాటలు కూడా రాసాడు . అలా తెలుగు ప్రేక్షకుల మదిలో “మాటల మాంత్రికుడు”గా ప్రసిద్ధి పొందాడు. పంచ్ డైలాగులకు, విలువలతో కూడిన డైలాగులకు పెట్టింది పేరు ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ .

స్వయం వరం సినిమా ద్వారా మాటల రచయితగా టాలీవుడ్ లో కి తెరంగేట్రం చేసాడు. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు వంటి సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లే రచయితగా ఉన్నాడు . ఆ తరువాత నువ్వే నువ్వే చిత్రంతో దర్శకునిగా తొలి ప్రయత్నం లోనే అఖండ విజయం సాధించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కించిన రెండవ చిత్రం “అతడు” మంచి విజయం సాధించడంతో త్రివిక్రమ్ కు బాగా గుర్తింపు వచ్చింది.

తరువాత జల్సా, ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది, సన్ అఫ్ సత్యమూర్తి, అ ఆ,అజ్ఞాతవాసి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. సాఫ్ట్ కామెడీ, రొమాంటిక్ కామెడీ లను చిత్రించడంలో సిద్ధహస్తుడు. ఎన్ని విధాలుగా మెళుకువలు ఉన్నాయి కాబట్టే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా అంటే ఇప్పటి హీరోలు ఎగిరి గంతేస్తున్నారు. త్రివిక్రమ్ తో ఒక్క సినిమా సరైనది పడితే చాలు ఇక లైఫ్ టర్న్ అయినట్టే అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు .

అలాగే ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అరవిందసమేత సినిమా తెరకెక్కించాడు . ఈ సినిమా పూర్తిగా రాయలసీమ నేపథ్యం లో ఫ్యాక్షన్
డ్రామాగా తెరకెక్కుతుంది . సాక్షాత్ టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా నేను త్రివిక్రమ్ తో సినిమా చేయాలనీ 12 ఏళ్లుగా అనుకుంటూ ఉన్న కుదరలేదు అని చెప్పాడు అంటే అర్థం చేసుకోవచ్చు త్రివిక్రమ్ క్రేజ్ ఏంటో .చూడాలి మరి త్రివిక్రమ్ రాబోయే రోజుల్లో ఎన్ని రికార్డ్స్ ని క్రియేట్ చేస్తాడో . మరో విశేషం ఏంటి అంటే చాలా కాలం తరువాత ఈ సినిమాతో సునీల్ మళ్ళీ కమెడియన్ పాత్ర లో మనముందుకు రాబోతున్నాడు .