వర్మకు నందమూరి కుటుంబం షాక్ ఇస్తుందా..?

nandamuri family , varma , rgv , trendingandhra

ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకేక్కే సినిమాలు ఇప్పుడు సిని రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితం అనగానే అందరికి ఎంతో ఆసక్తి ఉంటుంది. అలాంటి ఎన్టీఆర్ జీవితాన్ని ఇప్పటికే నందమూరి బాలకృష్ణ సినిమాగా మొదలుపెట్టారు. సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సంక్రాంతికి సిద్దమవుతుంది. ఈ తరుణంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శ్రీకారం చుట్టడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

ram gopal varma ,varma, trendingandhra

లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన నాటి తెరకెక్కించే ఈ సినిమాపై ఇప్పటికే అనేక అనుమానాలు ఉన్న నేపధ్యంలో నందమూరి కుటుంబం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. అయితే ఇటీవల ఎన్టీఆర్ కుమార్తె పురందరేస్వరి మాట్లాడుతూ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే టైటిల్ పై అసహనం వ్యక్తం చేసారు. దీనితో ఈ సినిమాను అడ్డుకోవాలని నందమూరి కుటుంబం కోరే అవకాశాలు ఉన్నాయి.