ముందుకి వీకెండ్ …షాక్ లో మందు ప్రియులు …!

 

ఈ మధ్యకాలం లో ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతుంది . ఎక్కడ ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కూడా మద్యం కూడా చాలా ముఖ్యమైపోయింది . ప్రస్తుత రోజుల్లో మద్యం లేకపోతె ఫంక్షన్స్ కూడా చేసే ఆలోచనలో ఎవరు లేరు . ఈ మద్యం వల్ల ఎందరో అమాయకమైన జీవితాలు బలైపోతున్న కూడా ఎవరు దీని గురించి మాట్లాడటం లేదు . ఇప్పుడు ఈ మధ్య గురించి ఎందుకు వచ్చిందో ఇప్పుడు చూద్దాం …

ప్రస్తుతం తెలంగాణ లో ఎన్నికల సెగ కనిపిస్తుంది . మరో రెండు నెలల సమయం మాత్రమే ఉండడం తో అందరూ కూడా ప్రచారం లో చాలా బిజీ గా గడుపుతున్నారు . ఎన్నికలంటేనే హామీలు , అధికారం లోకి వస్తే మేము అది చేస్తాం , ఇది చేస్తాం అని చెప్తూనే ఉంటారు . అలానే ఇప్పుడు తెలంగాణ బీజేపీ కూడా సంచలనమైన నిర్ణయం తీసుకున్నది .వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే మద్యం అమ్మకాలకు వారంలో 5 రోజులే అనుమతిస్తామని, రోజూ సాయంత్రం 6 గంటలకే విక్రయాలను నిలిపివేయిస్తామని బీజేపీ పేర్కొన్నది. మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయాలను బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌ శనివారం వెల్లడించారు.

ప్రతి సెలవు రోజున మద్యం అమ్మకాలను బంద్‌ చేయిస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెట్రోల్‌పై 35%, డీజిల్‌పై 27% వ్యాట్‌ను వసూలు చేస్తోందని, తాము అధికారంలోకి వస్తే దీన్ని రద్దు చేస్తామన్నారు. పండుగలు, జాతరలు, ఉత్సవాల సందర్భంగా ఆర్టీసీ సర్‌చార్జీ రద్దు చేస్తామని, అయ్యప్ప, కొండగట్టు, అమ్మవారి దీక్షలో ఉన్న వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు.

దేవాదాయ, వక్ఫ్‌, భూదాన్‌, చర్చిల ఆస్తుల పర్యవేక్షణకు టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. 3 నెలల్లో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేస్తామని, పంచాయతీలు, మండల, పురపాలక, మహానగరాల్లో స్వచ్ఛ భారత్‌ కోసం పని చేస్తున్న సిబ్బందిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తామని పేర్కొన్నారు. ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామని, ఎంబీసీ, రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ వంటి కార్పొరేషన్లకు కేటాయించిన నిధులను ఎప్పటికప్పుడు ఖర్చు చేసేలా ప్రయత్నిస్తామని ప్రభాకర్‌ చెప్పుకొస్తారు .