షాకింగ్  న్యూస్  : పవన్  ఫామ్ హౌస్  దగ్గర్లో  మహిళా దారుణ హత్య..!

pawan kalyan , Trendingandhra
 
జనసేన పార్టీ  అధినేత , పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ కి దగ్గర్లో ఎవరో  గుర్తు తెలియని మహిళ ధారుణ  హత్యకి గురైంది. రంగారెడ్డి జిల్లాలోని శంకర పల్లి మండలం జన్వాడ గ్రామ శివార్లలో ఉన్నటువంటి పవన్ ఫామ్  హౌస్ కి దగ్గర్లో   ఈ ఘటన జరిగినట్లు  పోలీసులు గుర్తించారు … అక్కడున్నటువంటి  స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఈ హత్య వారం  రోజుల  కిందట జరిగి ఉండవచ్చని , మరియు ఎవరో గుర్తు తెలియని దుండగులు   ఇంతటి అఘాయిత్యానికి పాల్పడి  ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు…దాంతో  పోలీసులు  కేసు  నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామన్నారు. మరియు  మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దగ్గరలోని  ప్రభుత్వ ఆసుపత్రి  కి తరలించారు …
Pawan Kalyan , Trendingandhra
 

అయితే  ఇది ఇలా ఉండగా పోలీసులు  ఈ కేసుని దహర్యాప్తు చేసే పనిలో నిమగ్నమై  ఉన్నారు … కాగా  అందులో  బాగం గా  అసలు ఇంతకీ  ఆ మహిళ ఎవరు ? అక్కడ  ఎందుకు ఆ ప్రాంతం లో  హత్య  కి గురైంది .అసలు ఆమెను  ఇంత కిరాతకం  గా చంపాల్సిన  అవసరం ఎవరుకుంది.లేదంటే ఆమెను ఎక్కడో హత మర్చి పవన్ ఫామ్ హౌస్ కి దగ్గర్లో పడేసి హత్యా రాజకీయం చేయాలనీ చూస్తున్నారా….  అనే  వివిధ  కోణాల్లో  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . అంతేగాక పవన్  ఫామ్ హౌస్ కి  దగ్గర్లో  ఉన్న నిఘా కెమెరాలను కూడా పరిశీలిస్తున్నట్లు  సమాచారం …. అయితే ఈ ఘటన కి సంబందించిన  పూర్తి  వివరాలు ఇంకా తెలియ రావాల్సి ఉంది …