వంగవీటి కి ఇవ్వలేం …..తేల్చేసిన వైసీపీ …..!

vangaveeti

వంగవీటి రాధాకృష్ణకు వైసీపీ గట్టి షాక్ ఇచ్చింది. విజయవాడ సెంట్రల్ టికెట్ తనకే ఇవ్వాలని రాధా పట్టుబడుతున్నప్పటికీ… ఈ సీటును కేటాయించలేమని వైసీపీ స్పష్టం చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ, విజయవాడ సెంట్రల్ సీటును వంగవీటికి ఇవ్వలేమన్నదే పార్టీ హైకమాండ్ నిర్ణయమని మరోసారి స్పష్టం చేశారు.

గెలుపు, ఓటముల లెక్క ప్రకారమే సీట్ల కేటాయింపులు ఉంటాయని చెప్పారు. పార్టీ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని అన్నారు. అయితే వంగవీటి కుటుంబాన్ని వైసీపీ దూరం చేసుకోదని… రాధాకు విజయవాడ తూర్పు అసెంబ్లీ లేదా మచిలీపట్నం పార్లమెంటు సీటును కేటాయిస్తామని తెలిపారు.

అంబటి వ్యాఖ్యలతో వంగవీటి వర్గీయుల ఆగ్రహావేశాలు మరింత పెరిగాయి. వైసీపీతో తాడో పేడో తేల్చుకోవాలనే నిర్ణయానికి వారు వచ్చారు.