ఉడికించకుండానే అన్నం తినేయచ్చు…

భారతదేశం లో ఆహార పదార్దాలలో రైస్ ఒకటి. ఈ ఆధునిక కాలంలో అన్నాన్ని అందరు బయట తెచ్చుకుంటున్నారు.. ఎందుకంటే బియ్యం కడగాలి… అందులో కావలిసినన్ని నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టి ఉడికించాలి. అప్పుడే అన్నం తయారవుతుంది. ఈ గోల మాకెందుకు అనే వారికీ ఒక శుభవార్త. వండే పనిలేకుండా నీటిలో నానబెట్టుకుంటే అన్నం అవుతుంది. నిజం అండి ఇదో ఎక్కడో కాదు మన భారతదేశం లో ని అసోంలో. ఇక్కడా రైతులు వీటినే పండిస్తున్నారు. ఆ బియ్యాన్ని చన్నీళ్లలో ఓ గంటసేపు నానబెడితే చాలు తినేయవచ్చు. ‘బోకా సౌల్‌’గా పిలిచే ఈ బియ్యాన్ని అసోంలో ఎప్పటి నుంచో పండిస్తున్నా పెద్దగా గుర్తింపు రాలేదు.

అసోంలోని మారుమూల ప్రాంతాల్లో ‘షాలి’ సీజన్‌ (జూన్‌ నుంచి డిసెంబరు) లో ఈ రైస్ ని పండిస్తారు. ఇక్కడ ఈ రైస్ ని బోకా సౌల్‌ లేదా ‘మడ్‌ రైస్‌’ అని అంటారు. ఇవి చూడ్డానికి దొడ్డు బియ్యంలా కనిపిస్తాయి. 17వ శతాబ్దంలో మొఘల్‌ రాజులపై పోరాడిన సైనికులకు ఇదే ఆహారం ఇప్పుడు అసోం పొలాల్లో చెమటోడుస్తున్న వందలాది మంది రైతులకు ఇదే కడుపు నింపుతోంది. ఈశాన్య రాష్ట్రమైన అసోంలో పండుగలైనా, పవిత్ర వేడుకలైనా అందులో అన్నానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ ఏదైనాసరే రైస్‌ ఉండాల్సిందే. అతిథులకు అందించే అన్నంలో బోకా సౌల్‌ కూడా ముఖ్యమైనదే.

తాజాగా గువాహటి యూనివర్సిటీ నిర్వహించిన సర్వే లో ఈ బోకా సౌల్‌ బియ్యంలో 10.93 శాతం పీచుపదార్థం, 6.8 శాతం మాంసకృత్తులు ఉన్నట్టు తేలింది. ‘ఈ బియ్యం తినడం వలన శరీరంలో వేడి తగ్గుతుంది అంతేకాదు ఈ రైస్‌లో పోషక విలువలు అధికంగా ఉంటాయి. ఇంకో విష్యం ఏమిటంటే ఈ రైస్ ని పండించటానికి రసాయన ఎరువులు అస్సలు వాడరు. ఒకవేళ వాడినా పంట పాడైపోతుంది’ అని వ్యవసాయ శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.